Tuesday, October 21, 2008

చిరంజీవి కి "పొత్తులు" అవసరమా ?

చిరంజీవి రాజకీయాల లోకి రాక ముందు ఎన్నో వూహాగనాలు విన్పించాయి. చిరు ఒక త్సునామి అని , ఒక ప్రభంజనం అని. కాని చిరు రాజకీయ ఎంట్రీ పూర్తి అవ్వగానే కొన్ని పార్టీ లతో పోత్తులకు సిద్దపడుతున్నాడు. పిఆర్పి నేతలు పైకి డబ్బాలు కొడుతున్న లోపల మాత్రం జన్కుతున్నరనే విషయం బయట పడ్తుంది. చిరు ఒక త్సునామి అయితే తెలంగాణా రాష్ట్ర సమితి ,కమ్యునిస్ట్ పార్టీ లాంటి తోక పార్టీ లతో కలవడానికి ఎందుకు అర్రులు చాస్తున్నాడు. తెలంగాణా లో చిరు ప్రభావం లేదని తెలుస్తుండడం తో చిరు పార్టీ కూడా కెసిఆర్ తో జట కట్టాలని భావిస్తున్నట్టు ఉంది . రాష్ట్రం లో అభివృద్ధి జరగడం లేదు అంతా అవినీతి జరుగుతూ ఉంది అని విమర్సిస్తున్నారే మరి ఈ విషయాన్ని ప్రజలకు చెప్పండి. ఎందుకంటే చిరు ఒక ప్రభంజనం కదా ఇంకెందుకు తోక పార్టీ ల తో పొత్తులు. వైస్సార్ తో తలపదాలంటే ఈ ప్రభంజనం సరిపోదా అంటే వైస్సార్ ఇంకా పెద్ద ప్రభంజనం అనే కదా దాని అర్ధం .

ఇక మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సామాజిక న్యాయం అంటున్నారు చిరు రిజర్వేషన్లకి వ్యతిరేకం అని చెప్పమను. అంటే కదా సమాజం లో అందరికి న్యాయం జరగాలంటే రిజర్వేషన్లు అడ్డమే కదా .కాని అలా అనడు ఎందుకంటే చిరు అందరి మాదిరే రాజకీయ నాయకుడు ఓట్ల కోసమే కదా ఈ వేషాలు.

చిరు ఒక ప్రభంజనమే అయితే పొత్తులు అవసరం లేదు కదా ఒంటరి గా పోటి చేసి నీ బలమెంతో చూపించు . అంతే గాని టిఆరెస్ తో కలుస్తాం , కమ్యునిస్ట్ లతో కలుస్తాం అని చెప్పడం దేనికి.
ఈ రాజకీయ నాయకుల ఇక్కట్లు చూస్తుంటే రాజశేఖర్ రెడ్డి బలం ముందు ఎవరూ సరిపోరు అనే ఆలోచన ప్రజలలో వచ్చే అవకాశం ఉంది.

No comments: