Sunday, October 26, 2008

చిరు ,జెపి కలవచ్చు కదా ?

లోకసత్తా అధినేత జయప్రకాష్ నారాయణ పార్టీ కి ప్రజాదరణ ఎందుకు రావటం లేదు. జెపి గారి సిద్దాంతాలు ఎంతో బాగున్నా కాని ప్రజల నుంచి మద్దతు ఎందుకో రావటం లేదు .కాని జెపి గారి ఆలోచనలు మాత్రం రాష్ట్రాన్ని ఎప్పటికి ఆయినా అవినీతి రహిత రాష్ట్రం గా చేయాలనుకుంటున్నాడు .

ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కూడా అవినీతి పై పోరాటం చేస్తామంటున్నాడు. ఇది రాష్ట్ర రాజకీయాలలో శుభ పరిణామం గా భావించవచ్చు .చిరంజీవి గారి పార్టీ విధానాలు ప్రకటించక పోయినప్పటికీ అవినీతి లేని రాజ్యం ప్రజా రాజ్యం అంటున్నారు కాబట్టి చిరంజీవి గారు జెపి గారి తో కలిస్తే ఇది నిజంగానే జరగవచ్చు .

జెపి గారి మాటలు ,చిరు గారి ఇమేజ్ జత కలిస్తే రాష్ట్రాన్ని సస్యస్యామలం చేయడం గ్యారంటీ .

No comments: